బ్రిటిష్ హైపర్ కార్‌పై విఘ్నేశ్వరుడు లోగో, వైరల్ స్టోరీ వెనక కథ
ఒకప్పుడు హిందూ మతం అంటే భారతదేశానికి మాత్రమే చెందిన విశ్వాసంగా ప్రపంచం చూసింది. కానీ ఇప్పుడు ఆ దృక్పథం పూర్తిగా మారింది. యోగా, ధ్యానం, కర్మ సిద్ధాంతం, ధర్మ భావన… ఇవన్నీ నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆకర్షిస్తున్న జీవన తత్వాలుగా మారాయి. హిందూ మతం ఇప్పుడు కేవలం ఆచారాల సమాహారం కాదు, మనిషికి అంతర్ముఖ శాంతి ఇచ్చే ఆధ్యాత్మిక మార్గంగా ప్రపంచం అంగీకరిస్తోంది.
అమెరికా నుంచి యూరప్ వరకూ, టెంపుల్స్ మాత్రమే కాదు యూనివర్సిటీలు, కార్పొరేట్ బోర్డు రూములు, లగ్జరీ బ్రాండ్ల వరకు హిందూ తత్వం చర్చకు వస్తోంది. విఘ్నేశ్వరుడు అడ్డంకులు తొలగించే శక్తిగా, శివుడు సమతుల్య శక్తిగా, రాముడు ధర్మబద్ధమైన జీవనానికి ఆదర్శంగా గ్లోబల్ స్థాయిలో అర్థం చేసుకుంటున్నారు. భక్తి కోణంలో కాకుండా, జీవన విలువలుగా మన దేవుళ్ళను ప్రపంచం చూస్తోంది
ఆ క్రమంలోనే ఈ ఆధ్యాత్మిక భావనను మరింత ముందుకు తీసుకువెళ్తూ మరో ముందడుగు వేసింది బ్రిటన్‌కు చెందిన Lanzante Limited సంస్థ. సూపర్‌కార్ రంగంలో పేరున్న ఈ సంస్థ తమ తొలి హైపర్‌కార్ 95-59ను ఆవిష్కరించింది. ఈ కారులో విఘ్నేశ్వరుడి ప్రేరణతో రూపొందించిన చిహ్నాన్ని లోగోగా ఉపయోగించింది. 2025 లో ఈ కారు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. కారణం దాని వేగం కాదు, లోగో లో ఉన్న విఘ్నేశ్వరుడు.
శుభారంభానికి ముందు గణేశుడిని స్మరించుకోవడం మన సంప్రదాయం. అడ్డంకులు తొలగించి, సజావుగా ముందుకు నడిపించే శక్తిగా గణేశుడిని భావిస్తాం. అదే భావనను Lanzante Limited తమ బ్రాండ్ ఆత్మగా తీసుకుంది. క్లిష్టమైన సమస్యలను దాటుకుంటూ, వినయాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలన్న సందేశం ఈ లోగో లో ఉన్న గణేసుడి చిహ్నంలో దాగుంది.
anzante Limited లోగోగా గణేశుడిని పెడితే బాగుంటుందనే ఆలోచన మాత్రం ది బీటిల్స్ సభ్యుడు George Harrison ది. ఆయనకు భారతీయ ఆధ్యాత్మికతపై నమ్మకం, విశ్వాసం ఉంది. దాంతో ఆయన Lanzante వ్యవస్థాపకుడు Paul Lanzante కు గణేశుడిని కంపెనీ లోగోగా తీసుకోవాలని సూచించినట్టు సమాచారం